అనుష్క `అధిక బరువు` సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. బరువు తగ్గించుకోవడానికి స్వీటీ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయి. `జీరో సైజ్` కోసం అనుష్క బరువు పెరిగింది. అప్పటి నుంచీ పెరుగుతూనే ఉంది. ఈమధ్య అనుష్క కొత్త సినిమాలు ఒప్పువడం మానేసింది. కేవలం బరువు తగ్గడంపైనే ధ్యాస పెట్టింది. అందుకే.. మీడియా ముందుకు కూడా రావడం లేదు.
యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొంది అనుష్క. నవీన్ పొలిశెట్టి హీరో. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది కూడా. అయితే అనుష్క మాత్రం సెట్‌కి రావడం లేదు. అనుష్కపై తీమయాల్సిన సీన్లు పెండింగ్ లో ఉన్నాయి. దానికి కారణం.. అనుష్క ఫిట్ గా లేకపోవడమే. “నేను బరువు తగ్గాలి. తగ్గాకే.. షూటింగ్ కి వస్తా“ అని నిర్మాతలకు చెప్పేసిందట స్వీటీ. చిత్రబృందం కూడా అనుష్కు కావల్సినంత సమయం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆమధ్య ఆస్ట్రేలియాలో.. బరువు తగ్గడానికి ట్రీట్ మెంట్ తీసుకొంది స్వీటీ. అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సహజమైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోందట. ఆ ప్రోసెస్ కి టైమ్ పడుతుంది. అందుకే అనుష్క టైమ్ అడిగింది. మరో రెండు నెలల వరకూ స్వీటీ సెట్ కి వచ్చే ఛాన్స్ లేదని, ఈలోగా స్వీటీ లేని సన్నివేశాలన్నీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.