అనుష్క..ఇప్పటికీ క్రేజీ హీరోయిన్. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. నవతరం కథానాయికలు ఎంతమంది వస్తున్నా, అనుష్క స్థానం అనుష్క దే. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఇప్పటికీ అనుష్కనే ఫస్ట్ ఛాయిస్. అయితే గత కొన్నాళ్లుగా వెండితెరపై అనుష్క సందడి తగ్గిపోయిందనే చెప్పాలి. చిత్రాల ఎంపిక లో బాగా సెలక్టీవ్ కావడం, దీంతో పాటు బాహుబలి అంకితం అయిపోవడం స్వీటీ సందడి తగ్గిపోవడానికి గల కారణాలుగా చెప్పొచ్చు. గత ఏడాది ‘సైజు జీరో’తో పలకరించినా ఆ ప్రయత్నం బెడిసికొట్టేయడంతో అసలు అనుష్క సినిమా చూసినట్లే అనిపించలేదు అభిమానులకు. అయితే ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది అనుష్క. అనుష్క నటించిన నాలుగు సినిమాలు ఇపుడు వరసకట్టేయనున్నాయి. సింగం 3( ఎస్ 3), నమో వెంకటేశాయ, ‘భాగ్ మతి, .. ‘బాహుబలి: ది కన్క్లూజన్’..ఇలా వరుసగా నాలుగు సినిమాలతో సందడి చేయనుంది స్వీటీ.
ఇందులో ముందుగా సింగం 3( ఎస్ 3), ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సింగం సీరిస్ అంటే అనుష్క కు వెరీ స్పెషల్ . ఇప్పటికే ఈ సిరిస్ లో వచ్చిన రెండు సినిమాల్లో అదరగొట్టింది అనుష్క. ఇక ఎస్ 3లో కూడా స్వీటీ గ్లామర్ రోల్ ప్లే చేసిందని టాక్. దీని తర్వాత నమో వెంకటేశాయ. ఇందులో పద్మావతి అమ్మవారు పాత్ర పోషించింది అనుష్క. ఇందులో సరికొత్త అనుష్క ని చూడొచ్చని చిత్ర బృందం చెబుతోంది. తర్వాత ‘భాగ్ మతి’తో అలరించనుంది అనుష్క. అనుష్క లీడ్ రోల్ రూపొందుతున్న చిత్రమిది. పిల్ల జమిందార్ ఫేం జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే వున్నాయి. ఈ సినిమాలో అనుష్క డ్యుయల్ రూల్ ప్లే చేస్తోందని భోగట్టా. ఇది వరకు అరుంధతి, పంచాక్షరీ చిత్రలలో ద్వీపాత్రభినం చేసింది స్వీటీ.
ఇక నాలుగోది ‘బాహుబలి: ది కన్క్లూజన్’ . యావత్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ‘దేవసేన’గా కనిపించబోతుంది స్వీటీ. తొలి బాగంలో కేవలం డీగ్లామర్ పాత్రకే పరిమైతమైన అనుష్క .. ఇప్పుడు పార్ట్ 2లో మహారాణి దేవసేన పాత్రలో కనువిందు చేయడానికి సిద్ధం అవుతుంది. మొత్తం మ్మీద అనుష్క నుండి సినిమాలు తగ్గిపోయాయి అని భావిస్తున్న ఆమె అభిమానులకు వరుస సినిమాలతో అలరించనుంది స్వీటీ.