అనుష్క ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ లో లేదు. బాహుబలి తర్వాత ఫుల్ రిలాక్స్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె దగ్గరకు చాలా ఆఫర్లు వెళ్ళాయి. కానీ స్వీటీ మాత్రం లైట్ తీసుకుంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకుంటుదని అన్నారు కానీ.. పెరిగిన బరువు తగ్గడంపైనే ఫోకస్ చేసింది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే.. మళ్ళీ స్లిమ్ అండ్ స్లిక్ లుక్ లోకి వచ్చేసినట్లు కనిపించింది. దీంతో మళ్ళీ అనుష్క సినిమాలు అంటూ వార్తలు మొదలయ్యాయి. నాగార్జున,వర్మ సినిమాలో అనుష్కనే హీరోయిన్ అని వార్తలు వచ్చాయి. అయితే ఇవి గాసిప్స్ గానే మిగిలిపోయాయి. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ అంటూ వర్మ ఓ ప్రకటన చేశాడు.
అయితే ఎట్టకేలకు అనుష్క ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలిసింది. అయితే ఇది టాలీవుడ్ సినిమా కాదు. అజిత్, శివ కలయికలో విశ్వాసం టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అనుష్క అనుకున్నారట. అనుష్క కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ఇదే జరిగితే బాహుబలి తర్వాత అనుష్క సైన్ చేసిన తొలి సినిమా ఇదే అవుతుంది. అలాగే అజిత్ తో ఆమెకు రెండో సినిమా. ఇంతకుముందు ‘ఎంతవాడు గానీ’ సినిమాలో అజిత్ కు జోడిగాకనిపించింది స్వీటీ.