కెరీర్ కొత్తలో గ్లామర్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి చెలరేగిపోయింది స్వీటీ అనుష్క! అవే ఆమెకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. అరుంధతి సినిమాతో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోయింది. ఆ తరవాత.. స్వీటీ పద్ధతి మార్చింది. కాస్త పద్ధతైన పాత్రలే చేస్తూ వచ్చింది. రుద్రమదేవి, బాహుబలి అందుకు తాజాగా ఉదాహరణలు. ఈసారి.. ఇంకాస్త అడుగుముందు వేసి, సన్యాసినిగా కనిపించబోతోందని టాక్. నాగార్జున – కె.రాఘవేంద్రరావు కలయికలో తెరకెక్కుతున్న చిత్రం.. ఓం వేంకటేశాయ నమః. అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. అనుష్క పాత్ర సన్యాసినిని పోలి ఉంటుందట. ఆ పాత్ర నుంచి ఏమాత్రం గ్లామర్ ఆశించరాదట.
అయితే అనుష్క రోల్లో పెర్ఫార్మ్సెన్స్కు స్కోప్ ఉందట. అందుకే ఈ సినిమాపై స్వీటీ సంతకాలు పెట్టేసిందని టాక్. పైగా రాఘవేంద్రరావు దర్శకుడాయె. నాగ్‌కి అనుష్క హిట్‌పెయిర్ అన్న పేరుంది. పైగా అనుష్క అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి వచ్చిన కథానాయిక. నాగార్జున కోసం ఏమైనా చేస్తుంది. అందుకే ఇంత ఛాలెంజింగ్ పాత్రని అనుష్క స్వీకరించడానికి ముందుకొచ్చిందని టాక్. అనుష్క కెరీర్‌కి ఈ సినిమా ఏమంత హెల్ప్ చేస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.