సమంత ప్రేమ – పెళ్లి… టాలీవుడ్ లో ఇప్పటికీ హాట్ టాపిక్కే. సమంత పెళ్లి విషయం లో ఎన్ని సందేహాలో, ఇంకెన్ని ఆశ్చర్యాలో. ఇప్పుడు మరో కథానాయిక అనుష్క కూడా ఇంతకంటే పెద్ద షాక్ ఇవ్వబోతొందా? అవుననే అంటున్నారు గాసిప్ రాయుళ్ళు. అనుష్క వయసు కూడా పెళ్ళికి దగ్గర పడింది. దానికి తోడు తన చుట్టూ కూడా ఎన్నో రూమర్లు. ఓ కథానాయకుడితో అనుష్క ప్రేమలో పడిందని తననే పెళ్లి చేసుకోబోతొందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరవాత వాటికవే సర్దుకున్నాయి. ఇప్పుడు స్వీటీ పై మరో రూమర్ హల్ చల్ చేస్తోంది. స్వీటీ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతొందని ఓ వార్త చక్కర్లు కొడుతొంది. ఐతే అనుష్క తో ముడిపెడుతొంది హీరోతో కాదు. ఓ బడా నిర్మాతతో.
సమంత పై అల్లుకున్న గాసిప్పులన్నీ ఒకొక్కటీ నిజం అవుతొండడంతో స్వీటీ పెళ్లి విషయం కూడా అదే కోణం లో చూడాల్సి వస్తోంది. బాహుబలి తరవాత అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమని, అయితే అదే ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది చెప్పలేమని అనుష్క సన్నిహితులు చెబుతున్నారు. స్వీటీ పై వచ్చిన రూమర్లకు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇలాంటి వార్తలు చాలాసార్లు వచ్చాయి… వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది వాళ్ళ మాట. మరి స్వీటీ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.