మొన్నటిదాకా ‘రుద్రమదేవి’ కోసం కత్తి పట్టి వీర సాహసాలు చేసిన స్వీటీ అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా కోసం అమాంతం 20 కేజీల బరువు పెరిగింది. సినిమాకు కావాల్సిన పాత్ర రీతిలో తనని తాను మార్చుకున్న అనుష్క విడుదల అయిన సైజ్ జీరో సినిమా నుండి కూడా మంచి పేరుని తెచ్చుకుంటుంది. నిన్న విడుదల అయిన అనుష్క సైజ్ జీరో సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మాస్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో లేకపోయినా సినిమాలో అనుష్క నటన అందరిని కట్టిపడేసింది.
ఇదంతా బాగున్నా సరే ప్రస్తుతం అనుష్క సినిమా కోసం పెంచిన ఈ బరువే తన పాలిట శాపమైంది. సినిమా కోసం బొద్దుగా తయారైన అనుష్క బాహుబలి సినిమా షూటింగ్లో పాల్గొనాలి.. అయితే ఆమె శరీర ఆకారం పూర్తిగా ఇదివరకులా వచ్చాకే ఆమెను కనబడమన్నాడట రాజమౌలి. త్వరగా సన్నపడి బాహుబలి సెకండ్ పార్ట్ కి సన్నద్దమవ్వమని చెప్పాడట. పెంచినంత సులభం కాదు కదా తగ్గించడం.. కాబట్టి అమ్మడు ఇప్పుడు తగ్గించడానికి నానా తిప్పలు పడుతుందట స్వీటీ.
అయితే అనుష్క ఇలా తన బరువు తగ్గించడం కోసం పడుతున్న పాట్లను చూసి.. కత్తి పట్టిన ఆ సుందరే తగ్గడం కోసం ఇప్పుడు కుస్తీ పడుతుందని జోకులేసుకుంటున్నారు నెటిజెన్లు.