కథానాయికలకు ఎప్పుడో ఒక టైమ్‌లో రిటైర్మెంట్ తప్పదు. సినిమాలపై మరీ అంత ఆసక్తి వుంటే క్యారెక్టర్ ఆరిస్టులుగానో, ఇతర కీలక పాత్రల్లో కెరీర్‌ను కొనసాగిస్తారు. 35ఏళ్లు దాటాక కూడా నాయికలుగా రాణించినవాళ్లు అరుదగనే చెప్పాలి. అయితే ఈ ట్రెండ్‌ను తిరగరాస్తానంటున్నది అనుష్క. మరో నాలుగేళ్లపాటు కథానాయికగా తన కెరీర్‌కు ఢోకా లేదంటున్నది. భాగమతి చిత్రం తర్వాత ఇప్పటివరకు మరే చిత్రానికి అంగీకరించలేదు అనుష్క. తాజాగా మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నది. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ సినిమాతో పాటు ఆదిపినిశెట్టితో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. తమిళంలో కూడా ఓ మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ థ్రిల్లర్ చిత్రం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. ఈ సినిమాలన్ని చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలడానికి మరో రెండేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మరికొన్ని సినిమాలు అనుష్క ఓకే చేసినట్లయితే నలభై ఏళ్ల వరకు నాయికగానే రాణించే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు. తన సన్నిహితలు వద్ద కూడా అనుష్క ఇదే మాటను చెబుతోందని అంటున్నారు.