టీడీపీ – బీజేపీ పొత్తు అంతర్గత వ్యవహారం.. అయినా కోరి దరిద్రాన్ని సంకలో పెట్టుకుంటారా అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో దీర్ఘాలు తీయడం…. అదీ కూడా జగన్‌తో ప్రధాని భేటీ ముగిసిన తర్వాత వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులకు స్పష్టమైన సూచికగా కనిపిస్ున్నాయి. ఏపీకి వచ్చిన అనురాగ్ ఠాకూర్ వైసీపీ సర్కార్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి వైసీపీ నుంచి కౌంటర్ అంటే.. జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ప్రధానితో కలవడమే. అక్కడ ఏం చర్చించారో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.
ఏపీలో పొత్తుల రాజకీయాలు అంతర్గతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని జనసేన పార్టీ ప్రకటిస్తోంది. ఆ పార్టీ ఓట్లు చీల్చబోమంటూ ప్రతిజ్ఞలు అలా చేయాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీకి దగ్గరతువుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీకి కూడా క్లారిటీ ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
వైసీపీ తన వ్యవహారశైలితో బీజేపీకి కూడా దూరమైందని.. పరోక్ష సంబంధాలను కూడా పోగొట్టుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలు చిన్నవి కావు. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ వారి పాత్ర బయటపెడతామని చెబుతున్నారు. ఇప్పటికే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైసీపీకి.. అదనంగా మారిన్ని కేసులు పడితే.. ఇబ్బందులు పడుతుంది.