ఏడాది అంతా ఇబ్బంది పెట్టిన 2020కి నీరసంగా కాకుండా.. ఆనందంగా గుడ్ బై చెప్పే చాన్స్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సూక్ష్మంలో మోక్షంలో ఆదాయం కూడా చూసుకంది. కొత్త సంవత్సర వేడుకలు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాల సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పన్నెండు గంటల వరకు దుకాణాలను తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే క్లబ్‌లు, పబ్‌లు.. కూడా.. ఒంటి గంట వరకూ తెరుచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. దీంతో నూతన సంవత్సర వేడుకలని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పరోక్షంగా అవకాశం కల్పించిటన్లయింది.
నిజానికి ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకూడదని పోలీసులు వారం రోజులుగా… క్లబ్‌లు, పబ్‌లతో పాటు హోటళ్ల నిర్వాహకులందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి అనుమతి ఇలా ఇవ్వగానే.. అలాగే వివిధ ఈనెంట్లు నిర్వహించే వారు మార్కెటింగ్ ప్రారంభించారు. ప్రభుత్వం ఈవెంట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. కేవలం మద్యం అమ్మకాల వరకే పర్మిషన్ ఇచ్చింది. కానీ.. అలా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ను.. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలు.. ఈవెంట్ కు అనుగుణంగా మార్చుకునేందుకు కసరత్తు ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం మాత్రం.. న్యూ ఇయర్ కోసం.. ప్రత్యేకంగా రిలాక్షేషన్ ఇవ్వాలని అనుకోవడం లేదు. నిజానికి ఏపీ సర్కార్ కరోనా కారణంగా… మద్యం అమ్మకాల్ని బంద్ చేయించాలనుకుంది. కానీ ఆదాయం పడిపోతుంది కాబట్టి.. వద్దనుకుంది. మామూలు సమయాల్లో మద్యం అమ్మాలని నిర్ణయించింది. దీన్ని పెంచితే.. విమర్శలు వస్తాయని… మద్యం అమ్మకాల సమయాన్ని పెంచాలని అనుకోవడం లేదు. దాంతో.. ఏపీ యూత్ జోష్ కూడా హైదరాబాద్‌లో నే జరగనుంది.