మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మార్చి 5న సాధారణ బడ్జెట్, 8న వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు మీడియాకి తెలిపారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఖరారు చేస్తారని తెలిపారు. ఈసారి కూడా సమావేశాలు హైదరాబాద్ లోనే నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.