ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. ఆ వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.
బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, శాసన సభా వ్యవహరాల మంత్రి పయ్యావులతో పాటు జనసేన నుండి నాదేండ్ల మనోహర్, బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు హజరయ్యారు.
Also Read : జగన్ తో ఆర్ఆర్ఆర్ సంభాషణ..ప్రేమా.. ర్యాగింగా?
ఏపీ అసెంబ్లీ నుండి ఐదు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమామేశంలో నిర్ణయించారు. ఈ నెల 26వరకు అసెంబ్లీ జరగనుంది. ఈసారి సభలో అన్ని శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఆయా శాఖల్లో జరిగిన విధ్వంసం అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించబోతున్నారు.
మంగళవారం గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలపై చర్చ జరగనుండగా… ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే గతంలో వైసీపీ తెచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై చర్చించేందుకు బీఏసీ సమావేశానికి రావాలని వైసీపీకి సమాచారం ఇచ్చినా… వైసీపీ డుమ్మా కొట్టింది.