పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావాలన్నారు శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జగన్ అసెంబ్లీకి రాననడం సరైంది కాదని.. పులివెందుల ప్రజల నమ్మకాన్ని నెరవేర్చేందుకు తప్పకుండా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలన్నారు.
శాసన సభలో సభ్యులందరి అభిప్రాయాలను గౌరవిస్తానని అయ్యన్నపాత్రుడు తెలిపారు. జగన్ సీఎం కాదు.. ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. నిబంధనల మేరకు అందరికీ మాట్లాడేందుకు సమయం కేటాయిస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో స్పీకర్ గా తనకు ఎవరి పట్ల వ్యతిరేక భావం ఉండదని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి హాజరై తన ధర్మం నెరవేర్చాలని సూచించారు. ప్రజలు నమ్మకాన్ని గెలిపించేందుకు సభకు హాజరై సమస్యలను లేవనెత్తాలన్నారు.
ఏపీల కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జగన్ ఎక్కడో టచ్ చేసినట్లు ఉన్నాయి. అందుకే అసెంబ్లీకి రానని, సభకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తమ పట్ల వివక్ష చూపుతారనే తరహాలో జగన్ వ్యాఖ్యానించారు.
తాజాగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. స్పీకర్ గా అన్ని పార్టీలకు చెందిన సభ్యులను గౌరవిస్తానని, నిబంధనల మేరకు మాట్లాడేందుకు సమయం కేటాయిస్తామని స్పష్టం చేశారు. దీంతో తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలకు అయినా జగన్ హాజరు అవుతారా? లేదో చూడాలి.