తెలంగాణ ఎన్నికలకు.. ఏపీ బలగాలు తీసుకోబోమని… కొద్ది రోజుల కిందట.. తెలంగాణ ఎన్నికల అధికారి.. రజత్ కుమార్ సైనీ.. ప్రకటన చేశారు. దానికి కారణంగా.. ఆయన టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులను ఉదహరించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో… ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు డబ్బులు పంచుతున్నట్లు.. టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని .. అందుకే… ఏపీ బలగాలను తాము కోరబోమని.. చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తెప్పించుకుటామని ప్రకటించారు. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై … ఏపీ డీజీపీకి నోటీసులు కూడా పంపారు. అయితే ఇప్పుడు… రజత్ కుమార్ సైని నిర్ణయం తేడా కొట్టింది. ఏపీకి చెందిన మూడు కంపెనీల బలగాలను.. ఉన్న పళంగా.. తెలంగాణకు పంపించాలంటూ.. కేంద్ర హోం శాఖ.. ఏపీ డీజీపీని కోరింది. ప్రస్తుతం చత్తీస్ ఘడ్లో ఉన్న ఏపీ బలగాలను.. అక్కడ్నుంచి తెలంగాణకు పంపే ఏర్పాట్లను ఏపీ డీజీపీ చేశారు.
దీంతో… ఏపీ బలగాలపై… రజత్ కుమార్ సైనీ చేసిన వ్యాఖ్యలు… మరో సారి తెరపైకి వచ్చాయి. నిజానికి ఏపీ పోలీసులపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుల్లో పస లేదు. ధర్మపురిలో వాళ్లు డబ్బులు పంచుతున్నారని… ఎలాంటి ఆధారాలు లేకుండానే టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అసలు ధర్మపురిలో ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏమిటనే అంశాన్ని కూడా.. ఎన్నికల అధికారి పట్టించుకోకుడా.. వాళ్లిచ్చిన వీడియోలను కూడా చూడకుండా.. నేరుగా.. ఏపీ డీజీపీకి నోటీసులు పంపారు. ఏపీ డీజీపీ … ఆ నోటీసుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటలిజెన్స్ పోలీసులు అన్న తర్వాత సమాచారం కోసం ఎక్కడికైనా వెళ్తారని.. ధర్మపురి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. అందుకే కాదు.. ఈసీ పంపిన వీడియోలో డబ్బులు ఎక్కడున్నాయని రివర్స్‌లో ప్రశ్నించడంతో సైనీకి… షాక్ తగిలినట్లయింది. దీంతో.. ఏపీ పోలీసులు కోడ్ ఉల్లంఘించలేదని మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు.
ఇప్పుడు ఏపీ బలగాల కోసం.. విజ్ఞప్తి చేసుకున్నారు. నిజానికి ఎక్కడెక్కడి నుంచి బలగాలు తెప్పించాలన్న విషయం.. తెలంగాణ ఎన్నికల అధికారి చేతుల్లో ఉండదు. తమకు ఎంత అవసరమో.. చెబితే ఆ మేరకు.. కేంద్ర ఎన్నికల సంఘం… వివిధ రాష్ట్రాల నుంచి సర్దుబాటు చేస్తుంది. ఈ విషయం రజత్ కుమార్‌కు తెలియక కాదు. అయినా సరే.. ఆయన ఏపీ బలగాలు వద్దంటూ ప్రకటన చేశారు. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏపీ బలగాల కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది. నిజానికి తెలంగాణ ఎన్నికల అధికారి తీరుపై.. విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలే చేస్తున్నాయి. వాటిని ఆయన డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు.