ఢిల్లీలోని ఏపీ భవన్ ను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెలలో జరిగిన సమావేశం తర్వాత కేంద్రం ప్రతిపాదలను రాష్ట్రాలకు పంపింది. మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలపగా… కేంద్రం మరో ఆప్షన్‌తో ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది.
కేంద్రం ప్రతిపాదనకు ఏపీ అంగీకరించలేదు. ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామని అధికారులు వెళ్లిపోయారు. ఏపీ భవన్ ను చాలా స్పష్టంగా ఏపీకే అప్పగిస్తామని కేంద్రం చెబితే వెంటనే అంగీకరించి రావాల్సిన ప్రభుత్వం తెలంగాణ తాజా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తామని కేంద్ర హోంశాఖకు చెప్పింది. కేంద్రం ప్రతిపాదన ప్రకారం పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అంటూ కేంద్రం ప్రతిపాదించింది. ఇది ఏపీకి పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యం.
అయితే ఏపీ ప్రభుత్వ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే హైదరాబాద్‌లో ఉమ్మడి ఆస్తులను తెలంగాణ సర్కార్ కు ఇచ్చేశారు సీఎం జగన్. కానీ ఏపీకి రావాల్సిన ఒక్కటంటే ఒక్క టి కూడా తీసుకు రాలేకపోయారు. విద్యుత్ బకాయిలను కూడా వసూలు చేయకపోగా.. హైకోర్టులో వేసి..దాన్ని న్యాయపరిధిలోకి నెట్టేశారు. ఇప్పుడు వసూలు చేసుకోవాలంటే కోర్టు కేసు పరిష్కారం కావాల్సి ఉంది. అలాగే ఏపీ భవన్ విషయంలో ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.