ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కొడాలి నానితో పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎన్ని కిలోమటర్ల దూరంలో ఉన్నా కొడాలి నాని బూతుల తుంపరను ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ఆయన జోలికి వెళ్లాలంటే.. ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు బీజేపీ నేతలు కొడాలి నానితో పెట్టకోవడానికి రెడీ అయిపోతున్నారు. తేల్చుకుందామా అని సవాళ్లు విసురుకుంటున్నారు.
గుడివాడలో ప్రజాచార్జిషిట్ అనే కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నానిపై మండిపడ్డారు. ఆయన భాష వల్ల ఏపీ పరువు పోతోందని.. బీజేపీ రాగానే అలాంటి వారిని జైల్లో పెట్టిస్తామన్నారు. అంత మాట అన్నతర్వాత కొడాలి నాని ఊరుకుంటాడా.. మైకులు కనబడగానే.. సునీల్ ధియోధర్ ను.. సునీల్ పకోడి గాడు అనే శారు. ఇలాంటి పకోడి గాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఇంకా అనరాని మాటలన్నారు .
సహఇంచార్జ్ నే అంత మాటలంటావా అని.. మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి కొడాలి నానిపై మండిపడ్డారు. గుడివాడ అభివృద్ధి, వైసీపీ పరిపాలనా వైఫల్యాలు అన్నింటిపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం గన్నవరం బస్టాండ్ దగ్గరకు కొడాలి నాని ఒక్కరే వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా తాును రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. గన్మోహన్రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయట పెట్టాలన్నారు.
విష్ణువర్దన్ రెడ్డి సవాల్ కు కొడాలి నాని స్పందిస్తే.. జంధ్యాల సినిమాలోలా అందరూ .. చెవులు మూసుకోవాల్సిందే. అయితే.. ఈ వివాదం పెద్దది అవుతుందా.. లేదా అన్నది కొడాలి నాని స్పందన బట్టే ఉండనుంది.