ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభ్యర్థుల ఎంపికపైస్పష్టత రావాల్సి ఉంది. మూడు పార్టీలు కలిసి 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయారు. ఏపీ పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్సభ సీట్లు తీసుకున్నారు. కాన అభ్యర్థుల్ని ఖరారు చేసుకోలేకపోతున్నారు.
ప్రో వైసీపీ బ్యాచ్ గా పేరు పడిన వారికి టిక్కెట్ ఇవ్వకూడదని. ఇచ్చినా టీడీపీ వాళ్లు ఓట్లేయరన్న అభిప్రాయం ఉంది. అందుకే సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారి పేర్లు ముందే ఫేడవుట్ అయ్యాయి. కానీ వారు హైకమాండ్ కు లేఖలు రాసి.. అదని.. ఇదని చెప్పి ఎలాగోలా.. రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకూ అభ్యర్థులు దొరకడం లేదు.
పోటీకి చాలా మంది వస్తున్నారు కానీ వారిలో గట్టి పోటీ ఇచ్చే వారు కనిపించడం లేదు. ఇతర పార్టీలు గెలుపు ఖాయం అన్న సీట్ల కోసం పట్టుబడుతున్నారు. విజయవాడ పశ్చిమలో జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది కానీ బీజేపీ పట్టుబడుతోంది. ఇలాంటివి కొన్ని స్థానాలకు జనసేనను బీజేపీ ఇబ్బంది పెడుతంది. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.