ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత..? ఇంకా పెట్టలేదు కాబట్టి ఎంతో చెప్పలేం. గత కొన్నేళ్లుగా పెడుతున్న బడ్జెట్లను పరిశీలిస్తే… రెండు, రెండున్నర లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేయవచ్చు. ఇందులో వాస్తవంగా ఎంత ఖర్చు పెడుతున్నారన్న విషయం పక్కన పెడితే.. అసలు బడ్జెట్ లెక్కలు ఆ మాత్రంగానే ఉంటాయి. కానీ ఈ సారి ఏపీ సర్కార్ తన బడ్జెట్‌ను ఎవరూ ఊహించని స్థితికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బడ్జెట్ పరిమాణం.. రూ. మూడు లక్షల కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే… బడ్జెట్ ప్రవేశ పెట్టని ప్రభుత్వం… గవర్నర్ ద్వారా మూడు నెలల ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్‌ను ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసింది. ఈ మొత్తం 90వేల కోట్లు.
అంటే మూడు నెలలకు 90వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుందన్నమాట. ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులను కేటాయిస్తారు. ఈ లెక్కన తరవాత కూడా ఖర్చు పెడతాయి. ఇంకా చెప్పాలంటే ప్రబు్తవం ఖర్చు పెంచుతుంది కానీ తగ్గించదు. ఒక వేళ ఇదే స్థాయిలో ప్రభుత్వ బడ్జెట్ ఉంటుందని అనుకుంటే… ఆ మొత్తం ూ. 3 లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ అవుతుంది. నిజానికి ఏపీ ప్రభుత్వ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పదివేల కోట్ల మేర తగ్గిపోయిందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం కలిపితే 78వేల కోట్ల ఆదాయమే కనిపిస్తోంది.
ఇది మొత్తం ఏడాదికి మిగతా మొత్తం అప్పల మీద నడిపించారు. అయితే అప్పులు తీసుకు రావడం కూడా అంత తేలిక కాదు. లక్ష కోట్ల లోపు ఆదాయం ఉన్న రాష్ట్రానికి మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్‌కు తగ్గ అప్పులు తీసుకు రావడం మామూలు విషయం కాదు. అలా తీసుకు రావడం ఘనతే. ఈ విషయంలో ప్రభుత్వం గట్టి నమ్మకంతో నమ్మకంతో ఉన్నట్లుగా ఉంది. అందుకే… బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నారు.