ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తన పథకాల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో… కాపు మహిళలకు మరో వరం ప్రకటించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి కాపు మహిళకు.. ఏటా రూ. 15వేల చొప్పున ఐదేళ్లలో.. రూ. 75వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. ఈ పథకానికి రూ. 1101 కోట్లు కేటాయిస్తూ.. కేబినెట్లో తీర్మానం చేశారు. కుటుంబానికి రూ. రెండున్నర లక్షల లోపు ఆదాయం ఉండి.. 45 ఏళ్లు దాటిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుందని… ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో ఈ పథకం విధివిధానాలను ప్రకటించి.. లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఐదేళ్ల పాటు ఇస్తామంటున్నారు కాబట్టి.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే.. మొదటి విడత.. రూ. 15వేలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు.. పెన్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత తాను ఆ హామీ ఇవ్వలేదని.. అసెంబ్లీలో ప్రకటించారు. కానీ.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిలళకు.. ఐదేళ్లలో రూ. 75వేలు ఇస్తామని.. నవరత్నాలలో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ల గురించి ప్రస్తావన తేకుండా.. ఒక్క కాపు మహిళలకు మాత్రమే.. ఈ పథకం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే.. కాపు మహిళల పథకం వేరని.. వచ్చే ఏడాది నుంచి… ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కూడా.. ఏటా రూ. పదిహేను వేలు ఇస్తారని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలా ఇస్తే… నాలుగేళ్ల పాటు… మాత్రమే.. ఇవ్వగలరు. అంటే.. రూ. అరవై వేలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది.
మంత్రివర్గ సమావేశంలో.. జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ ఇరవై ఆరో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరందర్నీ ఎప్పుడో నియమించారు. ఇప్పుడు కేబినెట్ ఆమోద ముద్ర వేశారు.