ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. ఈ సారి ఏ తేదీకి వాయిదా వేయాలో కూడా ప్రభుత్వానికి క్లారిటీ రాలేదు. అందుకే వాయిదా వేస్తున్నట్లుగా మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 8 న ఉ.11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుందని గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు వాయిదా వేస్తూ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా వాయిదా వేయడం నాలుగో సారి. మొదటగా గత నెల 25న నిర్వహించాలనుకున్నారు. అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఒకటో తేదీకి మార్చారు. మళ్లీ ఎనిమిదో తేదీకి మార్చారు. ఇప్పుడు ఎనిమిదిన కూడా నిర్వహించడం లేదు.
అయితే ఎన్ని సార్లు లవాయిదా వేసినా అసలు కారణం ఏమిటో మాత్రం ప్రభుత్వం.. అధికారులు ఎప్పుడూ చెప్పలేదు. అని వార్య కారణాలు అని అంటున్నారు కానీ.. అంత అర్జంట్‌గా అనివార్యంగా వాయిదా వేయాల్సిన కారణాలేమిటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆయా తేదీల్లో ముఖ్యమంత్రి అనివార్యంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఏమీ జరగలేదు. రేపు ఎనిమిదో తేదీన కూడా ఏమైనా ఉన్నట్లుగా క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి చనిపోయారు.
క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఎనిమిదో తేదీన ఏమైనా జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుని ఉంటారన్న చర్చ జరుగుతోంది. అందుకే కేబినెట్ భేటీని వాయిదా వేశారని భావిస్తున్నారు. కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పదో తేదీ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని సమావేశపర్చవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ కేబినెట్ భేటీని ఆలస్యంగా జరుగుతోంది..ఇక అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహిస్తారో చెప్పడం కష్టమే.