ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను అమరావతి నుంచి విశాఖ తరలించడానికి ప్రభుత్వం.. కోర్టులను సైతం..తప్పించుకునేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు.. రాజధాని రైతులు తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు మరింత గడువు కావాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సమయంలోనే… ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరవయ్యో తేదీ నిర్వహించాలనుకున్న మంత్రివర్గ సమావేశాన్ని రెండు రోజులు ముందుకు జరిపింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు భేటీని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం…హైకోర్టులో.. రైతులు పిటిషన్ వేసిన తర్వాతే జరిగింది. రైతులు.. సోమవారం మ.2.30వరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయొచ్చని హైకోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సమయం ఇచ్చింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్లోనే.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వకుండా అదేశాలు ఇవ్వాలని రైతులు కోరారు. దీనిపై.. కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని .. రైతుల తరపు న్యాయవాదులు భావించారు. ప్రభుత్వానికి కూడా ఇదే డౌట్ వచ్చినట్లుగా ఉంది.. అందుకే సోమవారం నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీని శనివారమే ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. హైపవర్ కమిటీ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో… తమ సిఫార్సులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇస్తామన్నారు. కానీ.. హైకోర్టులో రైతుల పిటిషన్ నేపధ్యంలో.. శనివారమే.. కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు కాబట్టి… హైపవర్ కమిటీ కూడా… కేబినెట్ భేటీకి ముందే.. రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించి.. ఆమోద ముద్రవేస్తారు.
హైపవర్ కమిటీ నివేదికలో .. భిన్నమైన అంశాలు ఉండే అవకాశం లేదని.. ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అసలు రిపోర్టులు రాసేవాళ్లు ప్రభుత్వంలో ఉన్నారని.. ఇతర కమిటీలన్నీ.. కేవలం సంతకాలకే పరిమితమని.. విపక్షాలు కొంత కాలం నుంచి ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నోట మూడు రాజధానుల మాట వచ్చింది కాబట్టి.. దాన్నే సమర్థిస్తూ.. హైపవర్ నివేదిక ఉంటుందని రాజధాని రైతులు సహా.. అన్నిపార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. అంటే… న్యాయపరంగా కూడా.. రాజకీయ వ్యూహాలను.. ఏపీ సర్కార్.. అమలు చేస్తోందన్న అభిప్రాయం రైతుల్ోల ఏర్పడుతోంది.