ఏపీ ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి ఎంత అడ్డదిడ్డంగా నడిపారో..ఎంత ఆర్థిక అరాచకానికి పాల్పడ్డారో కాగ్ రిపోర్టు వెల్లడించింది. సంవత్సరం మొత్తం ప్రతీ రోజూ.. ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ ఖాతా కింద అప్పు తీసుకుంటూనే ఉన్నారు. ఇక ఓవర్ డ్రాఫ్ట్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐదు నెలల పాటు ఏపీ సర్కార్ ఓడీలోనే ఉంది. అసెంబ్లీకి కాగ్ ఇచ్చిన రిపోర్టులోనే ఇదంతా ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 341 రోజుల పాటు వేస్అండ్ మీన్స్ అడ్వాన్సులను ఏపీ వినియోగించుకుంది. రిజర్వు బ్యాంకు ఖాతాలో రూ.1.94 కోట్ల కంటే తక్కువ నిల్వల కారణంగా ఏడాదిలో 1,18,039 కోట్లను వేస్ అండ్ మీన్స్ గా వాడుకుంది. దీనిపై వడ్డీ చెల్లించింది. ఇదే ఆర్ధిక సంవత్సరంలో 152 రోజుల పాటు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుంది.
మొత్తం రూ. 57,066 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకుంది. దీనికి కూడా భారీగా వడ్డీ చెల్లించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 73 మార్లు బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 57,478 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఏడాదిలో రూ. 8,411 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది.మూలధన వ్యయం కేవలం రూ.7244 కోట్లకు మాత్రమే పరిమితం. రాష్ట్రస్థూల ఉత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 0.55 శాతం మాత్రమనని ఆర్బీఐ బయట పెట్టింది. అంటే.. అప్పు చేసి మొత్తం పప్పుకూడు కింద ఖర్చ పెట్టేశారు.
ఆదాయం కోసం రూపాయి కూడా పెట్టలేదు. ఇక వివిద వివిధ కార్పోరేషన్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీలు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లుగా తేల్చింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.48,728 కోట్ల రుణాలు తీసుకోవాలని అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.52,508 కోట్ల రుణం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన మొత్తం కంటే అదనంగా రూ. 4,027 కోట్లను ఖర్చు చేసేశారు. ఎలా చూసినా ఏపీని వైసీపీ దివాలా తీయించిందని.. ఇన్ డైరక్ట్ గా కాగ్ తేల్చేసింది.