ఇవ్వాళ్ళ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతున్నారు. మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలిసి స్వచ్చభారత్ పై నీతి ఆయోగ్ ఉపసంఘం తయారు చేసిన నివేదికను అందజేస్తారు. ఆ తరువాత రాజధాని శంఖుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆయనకు ఇచ్చి ఆహ్వానిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, తరువాత హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ లను కలిసి రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఇప్పుడు కూడా యధాప్రకారం రాష్ట్రానికి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ప్రకటన, రాజధాని నిర్మాణం మరియు ఇతర పనులకు, ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా రాష్ట్ర రాజధానిలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడాలనుకొంటున్న వారికి స్థానికులుగా గుర్తింపు ఇచ్చేందుకు ఆర్టికల్ 371 (డి మరియు ఈ) చట్ట సవరణలు వంటి అనేక విషయాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటన కోసం ఒత్తిడి చేయవచ్చును.