విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు పంపింది. 25వ తేదీన ఉదయమే వచ్చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే కాకినాడ పోర్టు కేసులో ఆయనను ప్రశ్నించారు. విక్రాంత్ రెడ్డే అంతే చేశారని జగన్ రెడ్డికేం తెలియని చెప్పి వచ్చారు. ఈ సారి ఆయనను లిక్కర్ స్కాం కేసులో పిలిచారని చెబుతున్నారు. అడగకపోయినా లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డే కర్త, కర్మ, క్రియ అని గతంలో విచారణకు హాజరైనప్పుడు మీడియాకు చెప్పారు. లోపలేం చెప్పారో తెలియదు కానీ.. ఈ స్కాంలో కూడా పిలిస్తే అన్నీ నిజాలే చెబుతానన్నారు.
ఇప్పుడు మరోసారి పిలిచారు కాబట్టి ఆయన తనకు తెలిసినవన్నీచెప్పాలని సీఐడీ అధికారులు అడిగే అవకాశం ఉంది. అయితే ఆయన ఎప్పుడు చూసినా మాట కంటే ముందు జగన్ కేం సంబంధం లేదు .. అంతా ఆయన చుట్టుపక్కల ఉన్న వారు చేశారని చెప్పడం ప్రారంభించారు. దీని వల్ల అందరికీ జగన్ పై అనుమానం మరింత పెరుగుతోంది. తనకేం సంబంధం లేదని ఇతర పాత్రధారులే అంతా చేశారని చెప్పించడానికి విజయసాయిరెడ్డితో జగన్ గేమ్ ఆడుతున్నారా అని డౌట్ పడుతున్నారు.
విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో ఏం చెప్పినా. జగన్ కు సంబంధం లేదు అంటే సీఐడీ అధికారులు దాన్నే రాసుకునే పరిస్థితి ఉండదు. ఈ స్కాంలు ఎవరు చేసినా అంతిమ లబ్దిదారు మాత్రం జగన్మోహన్ రెడ్డేనని అందరికీ తెలుసు. సీఐడీ అధికారులు సాక్ష్యాలతో సహా నిరూపించడమే మిగిలి ఉంది. మరి వారిని విజయసాయిరెడ్డి ే మార్చగలరా అన్నదే అసలు పాయింట్ .