ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. సినీ పరిశ్రమతో ఏపీలో రాజకీయాలే ఉండవని కేవలం వ్యాపారం మాత్రమే ఉంటుందని తేల్చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ ఈవెంట్ సక్సెస్ అయింది. డిప్యూటీ సీఎం కూడా హాజరయ్యారు. పరిశ్రమ తరపున అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే పద్దెనిమిది శాతం జీఎస్టీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుందని రాజకీయాల్లోకి లాగే ప్రశ్నే లేదని తేల్చేశారు. అంటే ఏపీలో పరిశ్రమ వ్యాపారానికి ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసినట్లయింది.
హైదరాబాద్ పరిణామాలను ప్రస్తావించలేదు కానీ.. గేమ్ ఛేంజర్ ఈవెంట్ హైదరాబాద్ చేయలేకపోవడం లోటుగానే కనిపిస్తోంది. సంధ్యా ధియేటర్ ఇష్యూ తర్వాత ప్రభుత్వం స్పందించిన వైనంతో సినీ పరిశ్రమ టెన్షన్ లో పడింది. ఇప్పటికిప్పుడు భారీ ఈవెంట్లు చేయడం రిస్క్ అని భావించింది. అందుకే ఇండోర్ లో అదీ పరిమితమైన గెస్టుల మధ్య కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అయితే ఇలాంటి ఈవెంట్స్ వల్ల సినిమాకు పెద్దగా హైప్ రాదు. ఆ లోటు ఏపీ తీరుస్తోంది.
అదే సమయంలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇక్కడ కూడా కమిషన్లు.. ఇతర ఫ్యాక్టర్స్ పనిచేయవు. గత ప్రభుత్వంలోలా తాడేపల్లికి వచ్చి డీల్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిమాండ్ – సప్లయ్ సూత్రం ప్రకారమే టిక్కెట్ రేట్లు డిసైడైపోతాయి. మొత్తంగా తెలంగాణలో ఇండస్ట్రీకి సమస్యలు వస్తున్నా.. ఏపీలో మాత్రం అంతా సాఫీగా గడిచిపోతుందన్న సందేశాలు ఇస్తున్నారు. ఇది ఓ రకంగా ఇండస్ట్రీ మెల్లగా అయినా ఏపీ వైపు కార్యకలాపాలు పెంచడానికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు.