ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపు సింగపూర్ బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, ఉన్నతాధికారులు కూడా వెళుతున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో రాజధాని అమరావతి మాష్టర్ ప్లానులో చేయవలసిన కొన్ని మార్పులు చేర్పులపై సింగపూర్ నిపుణులతో చర్చిస్తారు. సింగపూర్ కూడా రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది కనుక ఆ అంశంపై కూడా వారు చర్చించవచ్చును. చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సేయిన్ లూంగ్, మంత్రి ఈశ్వరన్ తదితరులను కలిసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. చంద్రబాబు నాయుడు బృందం 23వ తేదీ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు.