సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సమయానికి జీతాలివ్వలేకపోతున్నారు. బిల్లులు చెల్లించలేకపోతున్నారు. అయినా సరే.. తన విలాసవంతమైన పరిపాలనా వైభోగానికి ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్నారు. తాజాగా హైఎండ్ ఫార్ట్యూనర్ 19 కార్లను కొనుగోలు చేశారు. వీటిని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ వీటికి బుల్లెట్ ఫ్రూఫ్ చేయించనున్నారు. మొత్తంగా ఈ కాన్వాయ్ కోసం రూ. పదిహేను కోట్ల వరకూ ఖర్చు తేలే చాన్స్ ఉంది.
జగన్ సీఎం అవగానే కొత్త కాన్వాయ్ లు కొన్నారు. ఒకటి తాడేపల్లి చుట్టుపక్కల తిరగడానికి.. ఇంకోటి జిల్లాల పర్యటనకు..మరొకటి ఢిల్లీలో ఉంచడానికి ఈ కాన్వాయ్ లు ఉన్నాయి. కొత్తగా కొన్నకాన్వాయ్ లు ఎందుకో తెలియదు కానీ.. ఏకంగా పందొమ్మిది ఫార్ట్యూనర్ కార్లను కొనుగోలు చేశారు. సీఎం కాన్వాయ్ లో ఇన్ని కార్లు ఉండవు. ఆరేడు కార్లు ఉంటాయి. కానీ ఏకంగా 19 కొనుగోలు చేయడంతో ఆయన మరింత రాజసం వలకబోసు కునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
జగన్ కాన్వాయ్ ప్రారంభమైన రెండు నిమిషాల వరకూ జనం అలా చూస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ కాన్వాయ్ ను రెడీ చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ కార్లు విజయవాడలో ఉన్నాయి. ఇలాంటి ఖర్చులను బహిరంగపర్చడాన్ని ప్రభుత్వం ఎప్పుడో నిలిపివేసింది. అందరికీ డబ్బులు ఎగ్గొట్టి.. ఇలా సొంత డాబులకు డబ్బులు ఖర్చు పెట్టడం ఏమిటో చాలా మందికి మిస్టరీగానే ఉంది. ఓ వైపు వేల కోట్లు అప్పులు చేస్తున్నా.. జీతాలివ్వలేని పరిస్థితి .