సీఎం జగన్ రెడ్డి తొమ్మిదేళ్లుగా చంద్రబాబుపై ఒకటే చెబుతూంటారు. ప్రజలకు విని విని బోర్ కొడుతుందేమో కానీ.. ఆయనకు మాత్రం అలా అనిపించడం లేదు. మాట్లాడితే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అంటారు.. చంద్రబాబు పేరు చెబితే పథకం గుర్తు రాదంటారు… చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటారు… ఇలాంటి మాటలతో చంద్రబాబును తిట్టి తన ఈగోను శాటిస్ఫై చేసుకుంటున్నారు కానీ.,.. తాను చెప్పిందే చెప్పి.. పాడిందే పాటరా అన్నట్లుగా వినే వాళ్లకు అసహనం కలిగిస్తున్నానని మాత్రం అనుకోవడం లేదు.
ఈ సోషల్ మీడియా యుగంలో కళ్ల ముందు జరిగిన దాన్ని కూడా… మార్చేసి… తాము చెప్పిందే నమ్ముతారన్న ఓ రకమైన మైకం సృష్టించామన్న ధీమానో.. చంద్రబాబు కులంపై ప్రజల్లో విద్వేషం నింపామన్న నమ్మకమో కానీ.. ఆయన తీరు మాత్రం… మారడం లేదు . నగరిలోనూ అంతే. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్దాలు, మోసాలు, కుతంత్రలేనన్నారు. అంగళ్లులో కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవల సృష్టించి లబ్ధి పొందాలని చూశారన్నారు. పోలీసులపై దాడులు చేయించాలని ఓ పోలీసు కన్ను కూడా పోయిందన్నవారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకే దండ వేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని విమర్శలు చేశారు.
కామెడీ ఏమిటంటే… కేంద్ర ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేస్తానని ఢిల్లీ వెళ్లారని… ఆయనే దొంగ ఓట్లు సృష్టించి ఆయనే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు జగన్. మరి పోటీగా వైసీపీ ఎంపీల్ని కూడా జగన్ రెడ్డి పంపించడం మర్చిపోయినట్లుగా ఉన్నారు. వైసీపీ హయాంలో ఏ ఉపఎన్నిక జరిగినా దొంగ ఓట్ల కోసం బస్సుల్లో వేల మంది వచ్చిన విషయం కళ్ల ముందే ఉంది. దొంగ ఓట్లను నమోదు చేసి.. అర్హులైన ఓట్లను తీసేస్తున్నారని అధికారుల్నీ సస్పెండ్ చేశారు. అయినా దొంగ ఓట్లు టీడీపీవంటూ చేతకాని కథలు చెబుతున్నారు.
నగరిలో జగన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్ మెంట్ బ టన్ నొక్కారు. డబ్బులు ఎప్పుడు పడతాయో ఎవరికీ తెలియదు. కానీ ఇంకా నాలుగు వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఒక్క పథకానికి డబ్బులు నాలుగు వాయిదాల్లో ఇస్తూ.. నాలుగు సార్లు బటన్లు నొక్కడానికి కోట్ల రూపాయల్లో ప్రకటనలు… బహిరంగసభలు ఏర్పాటు చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు జగన్ రెడ్డి. పార్టీ ప్రచారం కోసం.. ప్రజా ధనాన్ని వాడుతున్నారు.