జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం పేరుతో ప్రారంభించారు. భీమిలి బీచ్ కు దగ్గర్లో నిర్వహించిన సభలో 34 నియోజకవర్గాల నుంచి అతి కష్టం మీద 25వేల మందిని తరలించి సభను ఏర్పాటు చేశారు. కానీ అందులో జగన్ రెడ్డి స్పీచ్ అంద్రనీ ఆశ్చర్య పరిచింది. బటన్ నొక్కుడు సభల్లో చెప్పే ప్రసంగాలు తప్ప కొత్తదనమేదీ లేదు. రెండున్నర లక్షల కోట్లు పంచామని .. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలన్నట్లుగా జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇచ్చారో లేదో ప్రజలకు తెలుసు.. డబ్బులు ఎన్ని వచ్చాయో. ఎన్ని తమ దగ్గర వసూలు చేశారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు. అసలు ఎన్నికల ప్రచార సభ అంటే.. వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తామో ముందు చెప్పుకోవాలి.
అలాంటి ఆలోచనే జగన్ రెడ్డి చేయకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మేనిఫెస్టోను రూపొందించుకుని ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసినా కొత్తగా ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు.. ఇప్పటికే ఆయన నొక్కుతున్న బటన్లన్నీ ఓటి బటన్లు అయ్యాయి. డబ్బులు అకౌంట్లలో పడితే పడతాయి లేకపోతే లేదన్నట్లుగా మారింది. లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇంకా అప్పులు పుడతాయో లేదో తెలియదు. వచ్చి ఆదాయం మొత్తం అప్పులు, వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి. మరో వైపు పారిశ్రామిక రంగాన్ని కుళ్ల బొడిచారు.. నిర్మాణ రంగాన్ని పతనం చేశారు. ఆదాయం పెరుగుతుందే లేదు. ఐదేళ్ల కింద ఉన్న ఆదాయం కంటే ఇప్పుడు తగ్గింది. కేవలం మద్యం ఆదాయం మాత్రమే ఆరు వేల కోట్ల నుంచి పాతిక వేల కోట్లకు పెరిగింది. మిగతా అన్ని రంగాలు పతనమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ గెలిస్తే.. ఉన్న పథకాలు కూడా కొనసాగిస్తానని జగన్ రెడ్డి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆత్మస్తుతి , పరనింద అన్నట్లుగా సాగి.. చంద్రబాబును , పవన్ కల్యాణ్ ను తిట్టుకుంటూ సభలు పెట్టుకుంటే జనం ఓట్లేస్తారని ఎందుకు అనుకుంటున్నారో కానీ.. జగన్ రెడ్డి స్ట్రాటజిస్టులు కోర్ అంశాలనే మర్చిపోయారనే వాదన వినిపిస్తోంది. అసలు ఏం చేస్తారో చెప్పకుండా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం.. అంటే.. ఆయుధం లేకుండా యుద్ధానికి బయలుదేరినట్లుగా ఉందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారసభలకు స్టేజ్ డిజైన్ భిన్నంగా చేశారు. శిలువ గుర్తుతో ర్యాంప్ ఏర్పాటు చేసి..దాన్ని గ్రీన్ కలర్ లో తీర్చిదిద్ది.. దానిపై నడవడం ప్రారంభించారు.
దేవుడ్ని తొక్కుతున్నారని క్రైస్తవులు.. ఇదేం పిచ్చని ఇతరులు అనుకోవడం హైలెట్ గా మారింది. మొత్తంగా ఎన్నికల ప్రచారం కోసమే జగన్ రెడ్డి కొత్తగా తెర ముందుకువస్తున్నారు. బటన్ నొక్కే సభలకు.. దీనికి పెద్దగాతేడా ఏమీ లేదు.