ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానితో అరంగట సేపు భేటీ అయ్యారు. అయిన ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లి అరగంటసేపు ఉన్నారు. లోపల ఎంత సేపు భేటీ అయ్యారో స్పష్టత లేదు. బ యటకు వచ్చిన తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసేందుకు వెళ్లారు. హఠాత్తుగా ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారో ప్రభుత్వం చెప్పలేదు. ఎప్పుడైనా ..పోలవరం దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ అన్ని అడిగేసినట్లుగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రో మీడియాలో దాన్నే హైలెట్ చేస్తారు.
అయితే అంతర్గతంగా ఏంచెప్పారన్న దానిపై … ఏం అడిగారన్నది మాత్రం బయటకు వచ్చే చాన్స్ లేదు. వెంటనే ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారంటే అందులో ఖచ్చితంగా అప్పులకు పర్మిషన్ ఎజెండా ఉండే ఉంటుందన భావిస్తున్నారు. మరో వైపు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో తాము మద్దతు ప్రకటిస్తామని.. చెప్పి మరికొన్ని ప్రయోజనాలు నెరవేర్చాలని అడిగి ఉంటారని భావిస్తున్నారు.
అవి ఏమిటన్నది తెలియడం కష్టమే. మొత్తానికి ఎప్పట్లాగే సీఎం జగన్ ఢిల్లీ టూర్ సీక్రెట్ గానే సాగుతోంది. ఎప్పట్లాగే ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు లేవని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తామే కీలకమని వైసీపీ నేతలు చెబుతున్నందున.. ఆ మేరకు రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం పట్టుబట్టి సాధించుకోవాలని ఏపీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.