అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని మోసం చేసిన జగన్ రెడ్డి… ఎన్నికలకు ముందు వాలిడ్ కానీ హడావుడి డీఎస్సీ ఇచ్చారు. అయితే అసలు ఇవ్వకపోయినా బాగుండేదన్నట్లుగా ఈ డీఎస్సీ వ్యవహారంపై నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు మెగా డీఎస్సీ సెగ ఎక్కువగా తగుుదుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు… విస్తృతంగా పోరాటాలు చేస్తున్నారు. మంత్రుల ఇళ్లము ముట్టడిస్తూ హడావుడి చేస్తున్నారు.
ఓ సారి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆఫీసును ముట్టడించారు. దీంతో ఆయనకంగారు పడాల్సి వచ్చింది. ఆ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారని అనుకోలేదు. తర్వాత బొత్స ఇంటిని ముట్టడించారు. ఇలా వరుసగా మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థాయిలో యాక్టివ్ అవుతారని ఎవరూ అనుకోలేదు. షర్మిల తాను కూడా మెగా డీఎస్సీ కోసం సెక్రటేరియట్ ను ముట్టడిస్తానని ప్రకటించారు. గురువారం ఆమె సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.
కుమారుడి పెళ్లిలో బిజీగా ఉన్న షర్మిల.. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు 24వ తేదీన హైదరాబాద్ లో షర్మిల కుమారుడి రిసెప్షన్ ఉంది. అంత కంటే ముందే సెక్రటేరియట్ ముట్టడి నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు .. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లికి హాజరు కానీ సీఎం జగన్.. ఈ రిసెప్షన్ కు వస్తారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు.