ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో షర్మిల తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఓ సీనియర్ నేత అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. సీనియర్లను కలుపుకొని వెళ్ళకపోతే ఏపీలో కాంగ్రెస్ రేసులోకి రావడం ఇప్పట్లో జరిగే పని కాదని అధిష్టానానికి నివేదించినట్లుగా తెలుస్తోంది.
ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తే చాలు..చెలరేగిపోతామని చెప్పిన నేతలు షర్మిల తీరుతో విసిగిపోతున్నారు. రాజకీయాల్లో విశేషమైన రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ.. ఇప్పటికే ఎన్నో డక్కామొక్కీలు తిన్న అనుభవంతో పార్టీలో అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు షర్మిల. అందుకోసమే పదవులు , పార్టీ కార్యక్రమాల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కేలా చూసుకుంటున్నారు.
ఇదే సీనియర్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తాజాగా ఆమె విశాఖలో ఉక్కు కార్మికులకు మద్దతుగా వెళ్ళినప్పటికీ స్థానిక నేతలతోపాటు సీనియర్లకు సమాచారం ఇవ్వలేదనేది సీనియర్ల కంప్లైంట్. పార్టీకి ఆశాకిరణంలా భావించి.. షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కోరిన తమను కూడా షర్మిల పట్టించుకోవడం లేదని సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకొని..షర్మిలకు దిశానిర్దేశం చేయాలని కోరుతున్నార్లు. ఈ మేరకు అధిష్టానానికి ఇటీవల లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.లెత్తిన ఈ విషయంపై సైలెంట్ గా ఉండటమే మంచిదని రియాక్ట్ కాలేదా? అని చర్చ జరుగుతోంది.