ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం దిన దిన గండం.. మంగళవారం ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంటోంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆర్బీఐ ఇచ్చే అప్పులపై సవాలక్ష ఆంక్షలు పెట్టే కేంద్ర ఏపీ ప్రభుత్వానికి వేల కోట్లు ఇస్తూనే ఉంది. ఓ ప్రభుత్వం ప్రతీ వారం ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకునే సాహసమే చేయలేదు. కానీ ఏడాదిలో ప్రతీ మంగళవారం ఆర్బీఐ దగ్గర చేతులు చాచే ప్రభుత్వం ఏపీనే.
ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చిన అప్పుల పరిమితి ముగిసిపోయింది. అయినా కేంద్రం .. ఆ సంస్కరణ అమలు చేశారు.. ఈ సంస్కరణ అమలు చేశారని అప్పులు మంజూరు చేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో అసలు ఎందుకు అదనపు అప్పులకు పర్మిషన్ ఇస్తున్నారో కూడా తెలియదు. వారానికి రెండు, మూడు వేల కోట్లు అలా ఇస్తూనే ఉన్నారు. ప్రజలకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు.
ఇంత అప్పులు ఇస్తున్నా ఆర్బీఐ దగ్గర ఎప్పుడూ ఓడీ,, వేస్ అండ్ మీన్స్ కింద మైనస్ లోనే ఉంటుంది. అంటే ముందే ఇచ్చే అప్పుల్ని ఇలా ముందే తీసుకుని వడ్డీ కట్టుకుంటోందన్నమాట. ఎప్పుడైనా కేంద్రం అప్పులు ఇవ్వడం ఆపేస్తే.. ఒక్క సారిగా ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎమర్జెన్సీలోకి వెళ్లిపోతుంది. దివాలా తీసినట్లుగా ప్రకటిస్తారు. అందుకే ఎప్పటికప్పుడు.. దిన దిన గండం… మంగళవారం గట్టే ప్రభుత్వం అన్నట్లుగా మారింది.
ఏదో ఉద్దరిస్తారని ప్రజలు అధికారం అప్పగిస్తే అడ్డగోలు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి లేదు.. మరో వైపు సంక్షేమానికి కోతలు… అంతకు మించి అప్పల భారం. బాధ్యత లేని పాలకుల్ని ఎన్నుకుంటే.. ఇంత కంటే గొప్ప పరిపాలన ఎక్కడ లభిస్తుంది ?