ఆంధ్రప్రదేశ్ సీఎం పవర్ ఫుల్. మరి డిప్యూటీ సీఎం… పవర్ నిల్. అదీ దళిత వర్గానికి చెందిన వారయితే… కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వరు. వచ్చి పెట్టమన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మళ్లీ అమరావతిలో కూడా ఉండకుండా సొంతూరెళ్లిపోవాలి. పోనీ నియోజవక్రగంలో అయినా .. డిప్యూటీ సీఎంగా చెలామణి అవుతారా అంటే.. ఆ నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన కొంత మంది గ్రామస్థాయి రెడ్డి నాయకులు పవర్ ఫుల్ గా ఉంటారు. ఆయనను కనీసం పట్టించుకోరు. ఇక అధికారులు ఆయన డిప్టూటీ సీఎమ్మా.. అని జోకులేసుకుంటారు. ఇదంతా చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురించే.
భరించి..భరించి ఆయన ఒక్క సారిగా బ్లాస్ట్ అవుతున్నారు. రెడ్లు తనను వేధిస్తున్నారని..తమ పార్టీ వారే తనను అవమానాలకు గురి చేస్తున్నారని ఆయన భోరుమంటున్నారు. తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉంటారని, తాను ఎప్పుడు ఏమి మాట్లాడినా తమ పార్టీలోని వారే చులకనగా చూస్తారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఇటీవల ఆయన కొన్ని గ్రామాలకు గడప గడపకూ వెళ్తే.. వాళ్లంతా తాళాలేసుకుని వెళ్లిపోతున్నారు. అలా వెళ్లడం వెనుక తమ పార్టీ నేతలే ఉంటున్నారని నారాయణస్వామి అనుమానం. అందుకే తనకు అవమానాలు జరుగుతున్నా పార్టీ నేతలు స్పందించడం లేదని ాయనంటున్నారు.
చిత్తూరు జిల్లాలో మంత్రి ఎవరైనా పెద్దిరెడ్డి చెప్పిందే అధికారులు చేస్తారు. నారాయణస్వామి కూడా పెద్దిరెడ్డి కటాక్షాలతోనే ఎమ్మెల్యే టిక్కెట్ మంత్రి పదవి పొందారు. అయితే తన బాధ్యత ప్రకారం చంద్రబాబును బూతులు తిట్టడానికి… కులాన్ని తీసుకొచ్చి విమర్సలు చేయడానికి ఆయన ప్లేస్ కూడా చూసుకోరు. తిరుమలలోనూ అదే చెబుతారు. చివరికి ఆయనకూ పెత్తందారులు చుక్కలు చూపిస్తున్నారు.