అదేంటో వికేంద్రీకరణ పేరుతో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ మూడు చోట్ల పెడతామంటారు కానీ.. రాష్ట్రానికి వస్తాయని చెబుతున్న పెట్టుబడులను మాత్రం పూర్తిగా కడపకే కేటాయిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో రూ. 23 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ అదానీ లాంటి పెద్ద సంస్థలతో పాటు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఊరూపేరూ లేనికంపెనీ కూడా ఉంది. ఇది ఎనిమిదివేల కోట్ల పెట్టుబుడలు పెడుతుందట. సరే దీని వెనుక ఉన్న బినామీల కథ తర్వాత.. కానీ.. ఈ మూడు సంస్థలు కడపలోనే పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ మూడే కాదు.. జగన్ సీఎం అయిన దగ్గర్నుంచి చాలా జిల్లాల నుంచి పరిశ్రమలు పరారయ్యాయి. కానీ కడపలో మాత్రం తాము పెట్టుబడి పెడతామని చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంటలిజెంట్ సెజ్ అనే సంస్థ వస్తోందదోచ్ అని ప్రచారం చేశారు. అది కడప జిల్లాకే వస్తుందని ప్రకటించారు. అది మొదలు.. అనేక సంస్థలు కడప.. పులివెందుల, కొప్పర్తి పారిశ్రామిక వాడ అంటూ పెట్టుబడుల ప్రకటనలు చేశారు. ఆదిత్యబిర్లాసంస్థ కూడా ఓ యూనిట్‌ను కడప జిల్లాలోనే ఏర్పాటు చేసింది. మొన్నామధ్య ముల్క్ ఇండస్ట్రీస్ అనే సంస్థ కూడా కడపలోనే పెట్టుబడులు పెడతామని ప్రకటించింది .
కడపలోనే సెంచురీ ప్లై బద్వేల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. డిక్సన్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. డిక్సన్ సంస్థ ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్, కెమెరా తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఫర్నీచర్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న నీల్కమల్ సంస్థ, విద్యుత్తు మోటార్ల తయారీ రంగంలో పేరొందిన పిట్టి ఇంజినీరింగ్ సొల్యూషన్ సంస్థ కూడా ఇ కొప్పర్తిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. సరకు ఉత్పత్తులను తరలించే కాంకోర్ సంస్థకు చెందిన రైలు వ్యాగన్లు తయారు చేసే సంస్థ ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిసింది. ఐజీవై ఇమ్యూనోలాజికల్స్ సంస్థ కూడా ఏపీ కార్ల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇన్ని పరిశ్రమలు కడపకు వచ్చాయి. మిగతా ఏపీ మొత్తానికి ఇన్ని రాలేదు. కానీ ఇంత కంటే ఎక్కువే వెళ్లిపోయాయి. కడపకు వస్తున్నాయి.. వర్జినలా.. లేకపోతే… గిలిగింతలు పెట్టేవా అన్నవాటిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.