ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎం జగన్ భరించలేకపోతున్నారన్న ప్రచారం ఆధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదు. అడహాక్ డీజీపీనే కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయడం లేదు. కారణం ఏదైనా ఆయన డీజీపీగాఉన్నారు. కానీ జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఆయన మసలుకోలేకపోతున్నారు. ఆయన కోరుకునే అరాచక స్థాయిని పోలీసులు అందుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ పోలీసుల నుంచి ఇంకా చాలా దూకుడు కోరుకుంటున్నారు. కానీ లాంటిది కనపడటం లేదంటున్నారు.
అసలు సంబంధం లేని ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని స్పష్టం చేశారు. ఆయన అటు డీజీపీగా ఇటు ఏసీబీ డీజీగా ఉండలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఆ సమీక్షలో తనకు ఎదురుగా కనిపించిన రవిశంకర్ అయ్యన్నార్ ను ఏసీబీ డీజీగా నియమించాలని జగన్ సూచించారు. కానీ రవిశంకర్ అయ్యన్నార్ కుఇంకా డీజీ హోదా రాలేదు. అంతసీనియర్ కాదు. ఆయన ఏడీజీనే. అది తెలియకుండా జగన్ ఆయనను నియమించాలన్నారు. పక్కన వాళ్లు చెప్పినా పట్టించుకోలేదు. ఆ నియామం జరుగుతుందో లేదో కానీ జగన్ మాత్రం అర్జంట్ డీజీపీ నిర్వహిస్తున్న ఓ కీలకమైన విభాగాన్ని ఆయన నుంచి తప్పించాలనుకున్నది మాత్రం స్పష్టమయిందంటున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం నిబంధనలు గుర్తు చేసినా లేదా జగనే ఆయన వద్దని కొత్త వారిని ఎంపిక చేసుకున్నా.. డీజీగా చేసి రవీంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది. అది ఆయనకు అవమానమే. ఏ పోస్టులో చేసినా… ఆయన హోదా తగ్గినట్లే. అయితే సీఎం జగన్ ఇలాంటివి పట్టించుకోరు. ముందు ముందు పోలీసు వర్గాల్లో అలజడి రేపే నిర్ణయాలు ఉంటాయన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.