ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక.. మీకు అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ చేస్తూండటంతో ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఇవ్వాల్సిన పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు ఇవ్వడం లేదు. దీంతో వారు ఇప్పటికే ఉద్యమ బాట పట్టారు. వచ్చే నెల పదో తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని నోటీసులు కూడా ఇచ్చారు.
విద్యుత్ సంస్థల ఉద్యోగులు అత్యవసర విధుల నిర్వహణ పరిధిలోకి వస్తారు. వీరు సమ్మెలు చేయకుండా నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. వీరు ఆందోళనలు చేస్తారని అనుకుంటున్నప్పుడల్లా ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటుంది. ఈ సారి కూడా అలాంటిది చేయవచ్చు..కానీ విద్యుత్ ఉద్యోగులు మాత్రం గట్టిగా పోరాడాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి పోలీసులకు డబుల్ పని ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల నేతల్ని కేసులు పెట్టి నోరు మూయించడానికి ప్రభుత్వం వద్ద చాలా ఆయుధాలున్నాయి. సూర్యనారాయణ అనే ఉద్యోగ సంఘం నేతపై కేసు పెట్టి ఆయనను పరారీలో ఉండేలా చేశారు. ఆ భయంతో ఇతర ఉద్యోగ సంఘాల నేతలు జగన్ రెడ్డి ఆహా.. ఓహో అని పొగిడేసి బయట పడ్డారు. ఇప్పుడు విద్యుత్ సంఘాల నేతలపై పోలీసులు అదే ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన వారిపై కేసులు పెట్టడం… ఆధారాలు ున్నాయా లేవా అన్నది తర్వాత సంగతి.. చెప్పినట్లుగా చేయడం వారి వంతు అయింది. విద్యుత్ ఉద్యోగులుఎలా పోరాడుతారన్నదే కీలకం.