ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ విభాగం- జనవరి 1 న నూతన సంవత్సరం ఆలయాల్లో జరుపుకునే విషయం లో వివాదాస్పద, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
హిందూ ధర్మా ప్రచార ట్రస్ట్ విభాగం కార్యదర్శి డాక్టర్ చిలకాపతి విజయా రాఘవచార్యులు సంతకం చేసి విడుదల చేసిన నోటిఫికేషన్ (Rc.No.29 / HDPT / 2017) ప్రకారం ఆలయాల్లో జనవరి 1 న నూతన సంవత్సరం వేడుకలు జరుపకూడదు కేవలం తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నాడు మాత్రమే హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం వేడుకలు జరపాలి.
నోటిఫికేషన్ ఏం చెప్తోందంటే- “జనవరి 1 న వేడుకలు భారత వేద వ్యవస్థకు అనుగుణంగా లేవు.ఇంకా, ఆంగ్ల సంస్కృతి దేవాలయాలకు విస్తరిస్తోంది. న్యూ ఇయర్ కోసం, ఆలయాల్లో పూల అలంకరణలు, బ్యానర్లు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారంఇది సరైనది కాదు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేవాలయాలలో ఎటువంటి పూజలు నిర్వహించుకుడదు. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదికి మాత్రమే దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి”
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి, బిజెపి కి చెందిన పి. మాణిక్యల రావు ప్రోద్బలం తో నే ఈ నోటిఫికేషన్ విడుదలయిందని తెలుస్తోంది.