అసలే ప్రింట్ మీడియా కష్టాల్లో ఉంది. కానీ సాక్షి పత్రికకు మాత్రం జగన్ అధికారంలో ఉండటం అనూహ్యంగా కలసి వచ్చింది. ఒక్కో గ్రామ సచివాలయంతో రెండేసి పేపర్లు కొనిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులూ తప్పక కొనాలన్న రీతిలో ఇప్పటి వరకూ కథ నడిపించారు. ఈ సర్క్యూలేషన్ వల్ల సాక్షి సర్క్యూలేషన్ కుప్పకూలకంగా సాగుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మొత్తానికి ఉద్యోగుల నెత్తి మీద చేయి పెట్టడంతో వారంతా మెల్లగా సాక్షిని వదిలించేసుకుంటున్నారు.
తమ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ.. అడ్డగోలు విశ్లేషణలు చేస్తూ.. రాస్తున్న పత్రికను తాము ఎందుకు కొనాలనే అభిప్రాయంతో ఎక్కువ మంది ఉద్యోగులు వదిలేస్తున్నారు. దీంతో గత రెండు వారాల కాలంలోనే దాదాపుగా రెండు లక్షల కాపీల సర్క్యూలేషన్ సాక్షికి తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అయినా వైసీపీ అయినా వ్యూహం ఒక్కటే. తమకు అనుకూలంగా ఉన్నంత వరకూ బాకా ఊదడం.. హక్కుల కోసం ఎప్పుడు నోరెత్తుతారో.. అప్పుడు వారిపై అనేక రకాల ప్రచారాలు తెర మీదకు తేవడం. ఇప్పుడు అదే జరుగుతోంది.
అయితే తమపై దుష్ప్రచారాన్ని తాము డబ్బులు పెట్టి కొనుక్కోవడం కన్నా మూర్ఖత్వం ఉండదని ఉద్యోగులు రియలైజ్ కావడం కాస్త అనూహ్యమైన పరిణామం. అయితే ప్రింట్ ఆర్డర్‌ను తగ్గించుకోవాలని సాక్షి యాజమాన్యం అనుకోవడం లేదు. ఎలాగోలా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.