ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న ఫ్యాక్ట్ చెక్ ఆ ప్రభుత్వ నిర్వాకాన్ని ఏ మాత్రం తడబాటు లేకుండా వెల్లడిస్తోంది. ఈనాడులో వస్తున్నవన్నీ నిజమేనని పని గట్టుకుని మరీ చెబుతోంది. ఫ్యాక్ట్ చెక్ అని పేరు పెట్టుకున్నా.. మిస్ లీడింగ్ పేరుతో వివరణ ఇస్తున్న ఫ్యాక్ట్ చెక్.. తాజాగా పులిచింతల గేటు గురించి వివరణ ఇచ్చింది. ఈ వివరణలో మొత్తంగా పాయింట్ల వారీగా చెప్పారు. ఏం చెప్పారంటే.. ఈనాడులో రాసింది కరెక్టేనని. ఈ ఫ్యాక్ట్ చెక్ వివరణ చూసి.. అసలు దీన్ని ఎందుకు గెలుక్కోవడం అని వైసీపీ నేతలే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి.
గేటు నిర్మాణం పాలనామోదానికి 9 నెలలు పట్టిందని ఈనాడు చెబితే నిపుణుల కమిటీ పరిశీలించడానికి ఆ సమయం పట్టిందని ఫ్యాక్ట్ చెక్ చెప్పుకొచ్చింది. అంతే కానీ..తాము నెల రోజుల్లోనే ఇచ్చామని చెప్పలేదు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వలేదంటే… నిజమేనని ఒప్పుకుంది. ప్రాధాన్యతా క్రమంలో ఇస్తామని చెప్పుకుంది. గేటు నిర్మాణంలో మరియు బిగింపులో ఆలస్యం అయిందని ఈనాడు చెబితే 90 శాతం పనులయ్యాయని చెప్పుకొచ్చింది. కానీ ఆలస్యం కాలేదని మాత్రం చెప్పలేదు. కేవలం 30 శాతం పనులే పూర్తయ్యాయని ఈనాడు చెబితే కాదు 90 శాతం పనులయ్యాయని చెప్పుకొచ్చింది కానీ దానికి డాక్యుమెంట్ ఆధారాలేమీ ఫ్యాక్ట్ చెక్ చేయలేదు.
అయితే వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని అది తెలిసే ఈనాడు రాసిందని చెప్పుకొచ్చారు. నిజానికి పులిచింతల గేటు పెట్టడానికి ఇన్నాళ్ల సమయం తీసుకుంటారా అని సామాన్యులు ఆశ్చర్యపోతూంటే… మన ప్రభుత్వ ఘనకార్యం ఇలాగే ఉంటుందని.. ఫ్యాక్ట్ చెక్ … స్టాంపేసి మరీ చెబుతున్ననట్లుగా పరిస్థితి మారిది. ఈ ఫ్యాక్ట్ చెక్.. ఏపీ ప్రభుత్వానికి కాకుండా.. ఈనాడుకు సర్టిఫికేషన్ ఇస్తూ.. వారికి మేలు చేస్తోంది.