ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం దండిగా నిధులు అందిస్తోంది. రెండు నెలల పన్నుల వాటాను ఈ నెల ఇచ్చేసింది. దీంతో పాటు వివిధ గ్రాంట్ల కింద.. అలాగే అప్పుల పరిమితి కింద.. ఈ ఒక్క నెలలోనే దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది. సాధారమంగా మార్చిలో ప్రభుత్వంపై ఆర్దికంగా చెల్లింపుల భారం ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై కూడాప్రభుత్వం హామీ ఇచ్చింది.
రూ 3వేల కోట్ల మేర ఉద్యోగులకు ఈనెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. ఈ నెలలోనే 2023-24 ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా కింద రూ 1,40,318 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ 5,474 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,682 కోట్లు వాటాగా విడుదల చేసింది.
కేంద్రం ఇచ్చిన నిధఉలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఈ నిధులు ఉపశమనం కలిగిస్తున్నాయి. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో … రెండు, మూడేళ్ల నుంచి వారు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న తాము దాచుకున్న డబ్బుల్ని జమ చేశారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. వారి డబ్బులు వారికివ్వడానికి ఎమ్మెల్సీ ఎన్నికల సమయం వరకూ వేచి చూశారు. ఇంకా పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లేసే పరిస్థితి లేదుకాబట్టి వారెవరికీ ఇచ్చే అవకాశం లేదు.