వ్యూహం, శపథం అనే వర్త్ లెస్ సినిమాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ వర్మకు ఆ సినిమాల పేరుతో కొట్టేసిన ప్రజాధనం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ. కోటి పదిహనేను లక్షల రూపాయలను.. పన్నెండు శాతం వడ్డీతో పదిహేను రోజుల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఆర్జీవీకి నోటీసులు జారీ చేసింది. ఈ డబ్బులు వ్యూహం సినిమా ఫైబర్ నెట్లో ప్రసారానికి ఇచ్చి వ్యూస్ ప్రకారం తీసుకున్న డబ్బులు. ఎవరైనా ఒక్కరు సినిమా చూస్తే రూ. 100 ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటే మొత్తంగా 1800 మంది చేశారు. ఆయితే ఆయనకు రూ.కోటి పదిహేను లక్షలు చెల్లించేశారు.
అసలు ఆ సినిమాకు నిర్మాత ఆర్జీవీ కాదు. దర్శకత్వం చేసినందుకు ఆయన ఆ రైట్స్ తీసుకుని ఫైబర్ నెట్ కు ఇచ్చారేమో తెలియదు కానీ.. డబ్బులు మాత్రం ఆయన ఖాతాకే వెళ్లాయి. అసలు ఆ డబ్బులు ఇచ్చింది సోషల్ మీడియా లో బూతులు తిట్టినందుకని చాలా మందికి డౌట్. ఆ కేసులు కూడా పడ్డాయి. వారం రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయి కోర్టుకెళ్లి అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొట్టేసిన డబ్బుల విషయంలో నోటీసులు వచ్చాయి.
పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.