ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము ఒక్క రెడ్డి వర్గం మేలు కోసమే ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి కానీ.. ఆ సొమ్మంతా ఖర్చు పెడుతోంది నేరుగా రెడ్డి వర్గం వారికి కాదు. అధికార పార్టీ వారికి సన్నిహితంగా ఉన్న కొద్ది మందికే. మిగిలిన రెడ్డి సామాజికవర్గం వారు ఇతరులతో పాటు పేదరికంలోకి దిగిపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వమే లెక్కలతో సహా స్పష్టం చేసింది.
రాష్ట్రంలో 5.53 శాతం ఉన్న గిరిజనుల పెన్షన్లకు 2022-23 బడ్జెట్లో రూ.971 కోట్లు కేటాయించారు. కానీ రెడ్లకు మాత్రం రూ.1,555 కోట్లు కేటాయించారు. రెడ్లలో పేదరికం పెరిగినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఇచ్చే పథకాలన్నీ.. లెక్కల్లో కార్పొరేషన్ల కింద వేస్తూ ఉంటారు. పెన్షన్లు కూడా కార్పొరేషన్ ఇస్తున్నట్లే చూపిస్తారు.అందుకే కులాల వారీగా లెక్కలు బయటకు వస్తున్నాయి. గిరిజనుల కంటే.. రెడ్లు బాగా వెనుకబడిపోయినట్లుగా చూపించి వారికి లబ్ది చేకూరుస్తున్నారా లేకపోతే.. నిజంగానే రెడ్లలో పేదరికం పెరిగిపోయి.దారిద్ర్యంలోకి దిగిపోయారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదిలి పెట్టడం లేదు. ప్రభుత్వ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల.. రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక్క సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నా..అది అందరిపై ప్రభావం పడింది. వ్యాపార రంగంలో ఎక్కువగా ఉండే రెడ్లు.. ఈ కారణంగా దివాలా తీస్తున్నారు. దరిద్రమైన పాలన వల్ల తాము దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోతున్నామన్న అసంతృప్తి వారిలోనూ కనిపిస్తోంది.