దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కావొచ్చు. పట్టిసీమ దండగ అని వాదించిన ప్రభుత్వమే ఇప్పుడు పట్టిసీమతో కృష్ణాడెల్టాను కాపాడామని చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడలేదు. నిజానికి పట్టిసీమతో పూర్తి స్థాయిలో నీటి సౌకర్యం అందించే అవకాశం ఉన్నా ఈగో సమస్యలకు పోయి .. డెల్టా రైతులకు కన్నీరు మిగిల్చారు. ప్రభుత్వం నిర్వాకంపై మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనా సామర్థ్యంపై ఇలాంటి వార్తలు వస్తే వెంటనే… మిస్ లీడింగ్ పేరుతో తన వాదన రాసుకొచ్చే ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. కానీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పుడూ జగన్ రెడ్డిదే తప్పని నిరూపిస్తూ ఉంటుంది. ఈ సారి కూడా అదే జరిగింది.
కృష్ణా నదిలో నీరు లేకపోవడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని సరఫరా చేశామని.. పట్టిసీమ నుంచి 29.88 టీఎంసీలు తరలించామని చెప్పుకొచ్చారు. జూలై 21వ తేదీ నుంచి పట్టిసీమ ద్వారా నీరు తరలించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం వర్షాలు లేని పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి అరుతుగా వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రకృతి సహకరించని ఈ విపత్కర పరిస్థితిలో కూడా ప్రభుత్వం నీళ్లిచ్చిందని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెక్ అని పేరు పెట్టుకున్నారు కానీ.. ఇంత వరకూ ఒక్కటి కూడా ఫేక్ అని చెప్పలేదు. మిస్ లీడింగ్ అని తాము అనుకున్న వెర్షన్ చెబుతూ ఉంటారు. కానీ వారు చెప్పేదంతా ఫేక్ . కృష్ణాడెల్టాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా అక్కడి రైతులకు కళ్ల ఎదుటగానే ఉంది. కానీ సమయానికి పట్టిసీమ పంపులు వదలకుండా… పట్టుదలకు పోవడంతో మొదటికే మోసం వచ్చింది. కొంత మేర మేలుకున్న తర్వాత పట్టిసీమ ఆన్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.