చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చే రోజున ఏపీ ప్రభుత్వం కొత్త కేసు పెట్టింది. అది మద్యం కేసు. . అందులో ఏమైనా అవినీతి జరిగిందా అంటే చెప్పలేదు. మనీ ట్రయల్ ఉందా అంటే చెప్పలేదు. చంద్రబాబు, కొల్లు రవీంద్రలతో పాటు .. ఓ ఐఏఎస్ ఆఫీసర్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టారు. చంద్రబాబుపై కేసు పెట్టారని అందరూ అనుకున్నారు . కానీ ఈ కేసు లక్ష్యం ఎన్నికల సంఘమని ఇప్పుడు గుట్టు బయటపడింది.
ఈ కేసు ఎఫ్ఐఆర్లో మరికొంత మంది గుర్తు తెలియని అధికారులు అని పెట్టారు సీఐడీ అధికారులు. ఈ గుర్తు తెలియని అధికారుల పేరులో మీ పేరు రాబోతోందని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా బెదిరించడం ప్రారంభించారని అంటున్నారు. అలా రాకూడదంటే… ఓటర్ల జాబితాలో జరగుతున్న.. జరగబోతున్న అక్రమాలను పట్టించుకోకూడదట. స్వయంగా ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు ముఖేష్ కుమార్ మీనాపై ఈ బెదిరిపులకు పాల్పడ్డారని అధికార వర్గాలకు గుసగుసలాడుకుంటున్నాయి.
ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ ఆఫీసర్. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన పని చేయాల్సిందే. చంద్రబాబు హయాంలో ఎక్సైజ్ శాఖలో పని చేశారు. ఇది చాలు… ఏదో ఓ కేసు పెట్టడానికన్నట్లుగా మారిపోయింది. ఏపీలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరు ఘోరంగా ఉంది. అధికారుల్ని ఇలా బెదిరించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తూంటే.. ఘనత వహించిన .. కిరీటాలు పెట్టుకున్నవారు అదేదో గొప్ప పని అన్నట్లుగా చూస్తూండటమే అత్యంత విషాదం. వ్యవస్థలతో ఆటలాడితే.. ఆ వ్యవస్థలే మింగేస్తాయి.