ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తూ… 20 లక్షల మందికిపైగా కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్న ఇసుక… విషయం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఐదో తేదీ నుంచి ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని ప్రకటించిన సర్కార్.. రాత్రికి రాత్రే.. ర్యాంపుల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక తరలించే టెండర్లను.. రద్దు చేసేసింది. ఇది అనూహ్య పరిణామం. అంతకు ముందు… సాక్షి మీడియాలో.. ఆ టెండర్లన్నింటినీ… టీడీపీ నేతలు దక్కించుకున్నట్లుగా కథనాలు ప్రసారం చేశారు. ఆ తర్వాత రద్దు చేసేశారు. ఇప్పుడు.. కొత్తగా.. జీపీఎస్ సౌకర్యం ఉన్న వాహనాల యజమానులు.. కలెక్టర్ ఆఫీసులో సంప్రదించాలని చెబుతున్నారు.
అయితే.. ఇదంతా.. ఓ పద్దతి ప్రకారమే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువకు కోట్ చేసిన వారికి… కాంట్రాక్టులు ఇస్తే.. తమకు అన్యాయం జరుగుతుందని.. వైసీపీ నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేసినట్లుగా చెబుతున్నారు. అందుకే… టెండర్లు లేకుండా.. విచక్షణ ప్రకారం… స్థానిక అధికారులకే… ఇసుకను తరలించే అవకాశం అప్పగిస్తే.. ఎలాగూ.. అవన్నీ.. వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్తాయని భావించినట్లుగా తెలుస్తోంది. లారీలు, ట్రాక్టర్లకు.. జీపీఎస్ సౌకర్యం పెట్టుకునేవారు ఎవరూ ఉండరు. జీపీఎస్ ఉందని చెప్పి.. టెండర్లు తీసుకుని ఇక ఇసుకను స్టాక్ యార్డ్ పేరుతో.. ఎక్కడికైనా తరలించే వెసులుబాటు కోసమే… ఏపీ సర్కార్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ట్రాక్టర్ ఇసుక.. గతంలో పన్నెండు వందలు ఉంటే.. ఇప్పుడు .. పదివేలు అయిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ.. కొత్త ఇసుక విధానం వచ్చినా.. ఈ ధరలు తగ్గుతాయని మాత్రం చెప్పలేదు. కొత్త ఇసుక విధానం వచ్చినా.. కొన్నాళ్ల పాటు ఇబ్బందులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఆ ఉద్దేశం టెండర్ల రద్దేనని.. తాజా పరిణామాలతో నిరూపితమవుతుందని అంటున్నారు. ఐదో తేదీ తర్వాత కూడా.. ఇసుక ధరలు ఏ మాత్రం తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం… ఇప్పటికే నిర్మాణ రంగంలో ఏర్పడింది. అక్రమ ఇసుక నే ఎక్కువగా దొరికేలా.. ప్రభుత్వం వ్యవహరిస్తూండటమే దీనికి కారణమంటున్నారు.