జగన్ హయాంలో నమోదు చేసిన అక్రమ కేసులపై కమిషన్ వేసి ఎత్తి వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సభలో వైసీపీ హయాంలో కేసులు నమోదైన వాళ్లు లేచి నిలబడమని చంద్రబాబు కోరితే..సభలో ఉన్న వారిలో దాదాపు ఎనభై శాతం మంది నిలబడ్డారు. వారి పరిస్థితే అలా ఉంటే.. ఇక టీడీపీ కింది స్థాయి నేతల గురించి చెప్పాల్సిన పని లేదు రెండున్నర వేలకుపైగా కేసులు టీడీపీ క్యాడర్ పై ఉన్నాయి.
ప్రతిపక్ష నేతలందరిపైనా చట్ట విరుద్ధంగా కేసులు పెట్టించారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలపై వేలాది కేసులు పెట్టారని వారందరికీ న్యాయం చేయాల్సి ఉంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా పరిశీలించి .. కేసుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : సుద్దపూస సునీల్ కథలు !
గత ప్రభుత్వ హయాంలో కొంత మంది పోలీసులు అధికారులు కూడా జగన్ మోహన్ రెడ్డి కుట్రల్లో భాగం పంచుకుని తప్పుడు సాక్ష్యాలను సృష్టించి మరీ తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతల్ని అరెస్టు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్లుగా పని చేసిన పీవీ సునీల్ కుమార్, సంజయ్, ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సీతారామాంజనేయులు, ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి వంటి వారు నేరుగా టీడీపీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టారు. వీరికి మిసెరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఏ మాత్రం ఇబ్బంది లేకుండా న్యాయపరంగా కేసులు ఎత్తి వేస్తే… ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేక మందికి రిలీఫ్ ఉంటుంది.