ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు నిధులు అవసరం. ఆ నిధులు ఎలా సేకరించాలన్నదానిపై సలహాలిచ్చేందుకు ప్రత్యేకంగా సలహాదారుల్ని నియమించుకున్నారు. కానీ వ్యక్తులు ఇప్పటి వరకూ ఇచ్చిన సలహాలతో బండి నడిచింది. కానీ ఇక నుంచి నడిచే అవకాశం లేదు. అయితే..ఇప్పుడు కంపెనీలను సలహాదారుగా పెట్టుకుంటుంది. సాదా సీదా కంపెనీలతే అప్పులు తెప్పించి పెడతాయో లేదో తెలియదు కాబట్టి…బ్యాక్గ్రౌండ్లో భారీ తనం ఉన్న కంపెనీలయితే బెటర్ అనుకుంటోంది. అందుకే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయిన ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను సలహాదారుగా నియమించేసుకుంది. ఎస్బీఐక్యాప్స్గా చిరపరిచితమైన ఈ కంపెనీ నిధుల సేకరణ విషయంలో సలహాలు ఇస్తూ ఉంటుంది.
చాలా పెద్ద కంపెనీలకు ఇప్పటి వరకూ నిధులు సమీకరించి పెట్టింది. ఈ కంపెనీ సేవలు పొందాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి ఇప్పుడు ఏపీ సర్కార్కు భారీ ఎత్తున రుణం కావాలి. ఆఫ్ బారోయింగ్ రుణాలు రూ.పదకొండు వేల కోట్లు తీసుకునే చాన్స్ ఉంది. కానీ ఇచ్చెవారెవరు..?. ఏపీ సర్కార్ ఆర్థిక నిర్వహణ చూస్తున్న వారు ఎవరూ అప్పులిచ్చేందుకు సిద్ధపడటం లేదు. అందుకే ఎస్ బీ ఐ క్యాప్స్ ను ఉపయోగించుకుని … మంచి విధానాలను .. ప్రజెంట్ చేసి…అప్పులు తెచ్చుకోవాలనుకుంటోంది. నిధుల సమీకరణ కోసం..ప్రభుత్వాలు ఇలా ఇతర సంస్థల సేవలు తీసుకోవడం చాలా అరుదు.
కానీ ఏపీ సర్కార్ మాత్రం విరివిగా తీసుకుంటోంది. గతంలో ఓ విదేశీ ట్రస్ట్ నుంచి రుణం ఇప్పిస్తామని కొంత మంది ఇలాంటి సేవలు అందించేవారు వచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఐదు వందల కోట్ల వరకూ కమిషన్ అడగడంతో వెనుకడుగు వేశారని అంటున్నారు. ఇప్పుడు ఎస్ బీ ఐ క్యాప్స్ ఎంత రుణం ఇప్పిస్తుందో.. ఎంత కమిషన్ తీసుకుంటుందో స్పష్టంగా తెలియదు. బహుశా.. ఎవరూ ఇవ్వకపోయినా.. మాతృసంస్థ ఎస్బీఐ నుంచి అయినా లోన్ ఇప్పిస్తారని ఏపీ సర్కార్ ఆశపడుతూ ఉండవచ్చు..అందే ఎస్బీఐ క్యాప్స్తో ఒప్పందం చేసుకుని ఉండవచ్చు.