మన ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఆలయాలు అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో భాగం కావడం ” చట్టసభ సభ్యుని ప్రధాన బాధ్యత. అంతే కాదు ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఏపీలో అసలు అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి అన్నట్లుగా పెడుతున్నారు. కానీ అసలు ప్రజా సమస్యలపై చర్చించడానికి మాత్రం పెట్టడం లేదు.
ఏపీ ప్రభుత్వం అసలు అసెంబ్లీని నిర్వహించడం అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీని ఆరు నెలలలోపు సమావేశపరచడం రాజ్యాంగ విధి. ఖచ్చితంగా సమావేశపర్చాల్సిన టైమ్‌కు సమావేశపర్చి.. ఒకటి రెండు రోజులు నిర్వహించి మ మ అనిపిస్తున్నారు. వర్షాకాల సమావేశాలు పెట్టడానికి ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయింది. వచ్చే నెలాఖరుతో అసెంబ్లీని సమావేశపర్చి ఆరు నెలలు దాటిపోతోంది. దీంతో తప్పనసరిగా సమావేశపర్చాలి. ఓ రెండు, మూడు రోజులు నిర్వహిస్తే చాలని ప్రభుత్వం నుకుంటోంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన చివరి గడువు వచ్చే టప్పటికీ సమావేశపర్చి.. నాలుగైదు రోజులుసభ నిర్వహించి అయిపోయిందనిపిస్తున్నారు. చర్చలు ఎక్కడా జరుగుతున్నట్లుగా ఉండదు. గత నాలుగున్నరేళ్ల కాలంలో .. ఏ సీజన్లో అయినా అసెంబ్లీ జరిగింది వారంలోపే. పనిదినాలు చాలా తక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో సెలవులు పోను ఏడాదిలో కనీసం 28 నుంచి 31 రోజుల వరకూ పూర్తి పని దినాలుండేవి. ఇప్పుడు పూర్తిగా అసెంబ్లీని నిర్వీర్యం చేస్తున్నారు.
తిరుగులేని మెజార్టీ ఉన్నా… అతి తక్కువ సభ్యులతో విపక్షం ఉన్నా వారిని ఎదుర్కోవడానికి బూతులు, తిట్లు, దాడులు చేస్తున్నారు. అన్నీ చేసి సస్పెండ్ చేసి.. తాము చెప్పాలనుకున్నది చెప్పి …. సభను వాయిదా వేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్య ఆలయానికి విలువే లేకుండా చేసేశారు.