తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, సానుభూతి పరుల ఆస్తులపై అటు వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.. ఇటు ప్రభుత్వం కూడా తమకు దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు గీతం వర్శిటీ ఘటన ద్వారా వస్తున్నాయి. గీతం యూనివర్శిటీతో భూ వివాదం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ… ప్రభుత్వం అర్థరాత్రి కూల్చివేతలు ప్రారంభమయింది. ఎవర్నీ రానివ్వకుండా… కూల్చివేతను ఎవరూ అడ్డుకోకూడదన్న లక్ష్యంతో .. కోర్టుకు సెలవులు చూసుకుని మరీ కూల్చివేసింది.
2014లో వివాదాస్పద భూమిని రెగ్యులర్ చేసుకోవాలని అప్పటి మార్కెట్ ధర ప్రకారం ఎకరాకి రూ.8.26 కోట్లు చెల్లించాలని గీతం వర్సిటీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ భూమికి సంబంధించి యథాస్థితిని కొనసాగించాలని 2014లో గీతం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. 1981 సంవత్సరంలో గీతం విద్యాసంస్థ ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. మధ్యలో మొత్తం స్థలంలో నిర్మాణాలు చేపట్టలేదని ప్రభుత్వం కొంత భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వివాదం కోర్టుకు చేరింది.
విశాఖలో ఆక్రమణల పేరుతో టీడీపీ నేతల ఆస్తులే ఎందుకు కూల్చివేస్తున్నారనేది ఇప్పుడు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సినఅవసరం లేని ప్రశ్న. మాతో వస్తే.. వైసీపీ నేతల కబ్జాలన్నింటినీ నిరూపిస్తామని… టీడీపీ నేతలు అధికారులకు మంత్రులకు సవాల్ చేస్తున్నారు. వైసీపీ నేతల భూ కబ్జాలను నిరూపిస్తానని.. చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్తే.. ఎయిర్ పోర్టులోనే… పోలీసుల సాయంతో ఆపేసి వెనక్కి పంపేశారు. ఇప్పుడు.. టీడీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కూల్చివేతలపై కోర్టు స్టే ఇచ్చింది..కానీ ఇప్పటికైతే ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు జరగాల్సిన నషఅటం జరిగిపోయింది.