చేసింది తప్పుడు పని.. దాన్ని సమర్థించుకోవడానికి ఫ్యాక్ట్ చెక్లు చేయడం ఏపీ ప్రభుత్వం స్టైల్. కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో .. యోగి వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టారు. అది కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదేం పని.. ఇదేం విగ్రహాల పిచ్చి అని జనం నోళ్లు నొక్కుకుంటూంటే.. అదేం లేదని అడ్డగోలుగా వాదించడానికి ఫ్యాక్ట్ చెక్ ముందుకు వచ్చేసింది. పత్రికల్లో వచ్చినవన్నీ తప్పుడు కథనాలని చెప్పింది.. మరి వేమన విగ్రహం అక్కడే ఉందా అంటే… లేదు.. దాన్ని తీసేశారనే ఫ్యాక్ట్ చెక్ చేబుతోంది.
యోగి వేమన విగ్రహాన్ని ఎంతో గౌరవంగా తొలగించి.. అంత కంటే ఎక్కువ గౌరవంగా యూనివర్శిటీ గేటు వద్ద పెట్టారట. గతంలో యోగి వేమన విగ్రహం రోడ్డు మధ్యలో ఉండేదని..ఇప్పుడు యూనివర్శిటీ గేటు మధ్యలో పెట్టారన్నారు. అలాగే యోగి వేమన విగ్రహాన్ని తొలగించిన చోట.. వైఎస్ విగ్రహం పెట్టారన్న వాదన కూడా కరెక్ట్ కాదట. ఆ విగ్రహం గతంలోనే యూనివర్శిటీలో ఉందన్నారు. అయితే అది మరో చోట ఉండేదని.. కానీ ఇప్పుడు యోగి వేమన విగ్రహం ఉన్న చోటకు మార్చారన్నారు. రోడ్డు మధ్యలో వేమన విగ్రహం ఉందని తీసేసి.. అక్కడ వైఎస్ విగ్రహం పెట్టారని చెబుతున్నారన్నమాట.
నిజానికి మీడియాలో వచ్చి వివాదాస్పదమైన తర్వాత ఆ విగ్రహాన్ని హడావుడికి గేటు వద్ద ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఫోటోలు తీసి మీడియాకు విడుదల చేశారని విపక్షల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఉన్న చోట నుంచి విగ్రహాన్ని మరో చోట పెట్టడం గౌరవం ఇవ్వడం ఎలా అవుతుందని… ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం ఏం చేసినా కరెక్టే.. కానీ మీడియా చెబితే మాత్రం.. అది తప్పుడు వార్త . జరిగింది మాత్రం నిజం.. అక్కడ వేమన విగ్రహాన్ని తొలగించారు.. వైఎస్ విగ్రహాన్ని పెట్టారు. కానీ అది కాదు.. అని కొత్తగా ఫ్యాక్ట్ చెక్ చే్సతున్నారు.. ఘనత వహించిన పెద్దలు.